తాడ్వాయి మండలంలోని పలు పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించిన డీఈఓ
(నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా తాడ్వాయి జూలై 31: కామారెడ్డి జిల్లా విద్యాధికారి (డీఈవో) మల్లికార్జున్ తాడ్వాయి మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా జెడ్పీహెచ్ఎస్ కృష్ణాజివాడి, ఎంపీపీఎస్ కృష్ణాజివాడి పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించి, బోధన విధానాలపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థుల చదవడం, అర్థం చేసుకునే నైపుణ్యాలను పరిశీలించారు. విద్యార్థి మణికాంత్‌ను చదివించి అతని అభ్యసన సామర్థ్యాన్ని పరిశీలించిన డీఈవో, ప్రతి విద్యార్థి విషయ పరిజ్ఞానాన్ని మరింత పెంపొందించుకుని పదో తరగతి...