NAMASTE INDUR
Newspaper Banner
Date of Publish : 20 August 2026, 2:34 pm Posted by : MEDUDHULA KASHAGOUD

తిప్పారం గ్రామంలో రూ.10 లక్షల సీసీ రోడ్డు ప్రారంభం..

-ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్ ఆదేశాలతో అభివృద్ధి పనులకు శ్రీకారం

(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి ఆగస్టు 20:

కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్‌మోహన్ ఆదేశాల మేరకు గాంధారి మండలం తిప్పారం గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను ఈరోజు ప్రారంభించారు. గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ సీసీ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గ్రామంలోని ప్రజలకు రాకపోకలకు ఇబ్బందులు లేకుండా రహదారి సౌకర్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో ఈ సీసీ రోడ్డు పనులను చేపట్టినట్లు తెలిపారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే వర్షాకాలంలో బురద, గుంతల కారణంగా ఎదురయ్యే ఇబ్బందులు తొలగడంతో పాటు ప్రజలకు సౌకర్యవంతమైన రాకపోకలు అందుబాటులోకి వస్తాయని గ్రామస్తులు తెలిపారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ. తమ గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించినందుకు ఎమ్మెల్యే మదన్‌మోహన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలోని మరిన్ని సమస్యలను కూడా దశలవారీగా పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ప్రమోద్ మాధవరావు, ఉప్ప సర్పంచ్ శ్రావణ్, పీఆర్‌ఏఈ, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.