దమ్మపేట చేరిన ప్రజా చైతన్యయాత్ర…
నమస్తే ఇందూర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:
కమ్యూనిస్టు పార్టీ ఎవరి పక్షం కాదు.. ప్రజల పక్షం
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా చైతన్య యాత్ర
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జిల్లాలో కొనసాగుతున్నా ప్రజా చైతన్య యాత్ర బుధవారం దమ్మపేట మండల కేంద్రానికి చేరుకున్నరు యాత్రకు అడుగడుగునా ప్రజలు ఘన స్వాగతం పలికారు యాత్రలో భాగంగా కామ్రేడ్ యార్లగడ్డ భాస్కర్ రావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం..మండలకార్యదర్శి సుంకిపాక ధర్మ అధ్యక్షతన…….జరిగిన సభలో జిల్లా ప్రధాన కార్యదర్శి సాబీర్ పాషా మాట్లాడుతూ.. మాట్లాడుతూ దేశంలో ప్రజా సమస్యలపై చైతన్యం కల్పించి మార్పు తీసుకువచ్చేందుకు కలిసికట్టుగా యాత్రలో అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలన్నారు. ప్రజలను దోచుకునే పాలన మారాలని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద యువత, విద్యార్థులు చేపట్టిన ఉద్యమమే ప్రజా చైతన్యానికి నిదర్శనమన్నారు.మండలంలో గతం లో ఉన్న సమస్యలకు ప్రభుత్వాలు మారిన పరిష్కారం దొరకటం లేదన్నారు, జూనియర్ కళాశాల కోసం మండలం లోని విద్యార్థులు పక్క మండలం కు వెళ్లి చదువుకోవాలసిన పర్శిస్థితి ఉంది అని , ఎంతో మంది కి గతంలో ఉపయోగపడిన బస్టాండ్ నిరువోపయోగంగా ఉంది అని అన్నారు ఎన్నికల సమయం లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఉంటే రాబోయో ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు,. పోడు భూముల సమస్యలు పరిష్కరించి గిరిజన ఆదివాసీ రైతులకు హక్కులు కల్పించాలని, పోడు రైతులపై అటవీశాఖ అధికారులు నమోదు చేస్తున్న కేసులను ఉపసంహరించి రక్షణ కల్పించాలన్నారు. జనం ఎజెండాను విస్మరించిన పాలకవర్గాలపై ప్రజల తరఫున పోరాటం చేయడమే ఈ ప్రజా చైతన్య యాత్ర లక్ష్యమని తెలిపారు. యాత్రకు ప్రజల నుంచి అపూర్వమైన స్పందన లభిస్తోందన్నారు.కమ్యూనిస్టు పార్టీ ఎవరి పక్షం కాదు.. ప్రజల పక్షం అని సాబీర్ పాషా స్పష్టం చేశారు. ప్రజల మేలు, భద్రత, వారి జీవితాల్లో మార్పు కోసం పోరాట అజెండాతో ఎర్రజెండా ముందుకు సాగుతోందన్నారు. ప్రజా చైతన్య యాత్రకు స్వాగతం పలుకుతున్న ప్రతి ఒక్కరికీ, యాత్రలో భాగస్వాములవుతున్న ప్రజలకు విప్లవాభివందనాలు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబర్ 1న ‘చలో ఢిల్లీ’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ‘చేంజ్ ఇండియా.. సేవ్ ఇండియా’ నినాదంతో పాలనలో మార్పు కోసం దేశవ్యాప్తంగా ప్రచార ఉద్యమాన్ని కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సాబీర్ పాషా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం కల్లూరు వెంకటేశ్వరరావు ,నరాటి ప్రసాద్. సలిగంటి శ్రీనివాస్. కంచర్ల జమలయ్య సారెడ్డి పుల్లారెడ్డి ఉప్పుశెట్టి రాహుల్.. ఫాయిమ్ మున్నా లక్ష్మి కుమారి. వేల్పుల మల్లికార్జున.మరియు మండల కార్యదర్శి సుంకిపాక ధర్మ, సహాయ కార్యదర్శి యార్లగడ్డ మణికంఠ,యార్లగడ్డ ఈశ్వరరావు,తంగెళ్ల శివ కృష్ణ, బెజవాడ రాము, జానబీ నక్క నాగమణి. గాజుబోయిన కృష్ణవేణి.నల్ల ప్రసాద్. కూకలకుంట సత్యనారాయణ. వీరాస్వామి. అశోక్.మురళి. జానీబేగం దేవదాసు , పాల్గొన్నారు.