పద్మాజివాడిలో ఘనంగా వన మహోత్సవం
నమస్తే ఇందూర్,
పద్మాజివాడి: పచ్చదనం పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా పద్మాజివాడి గ్రామంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ లోకోటి సుబ్బారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామంలో మొక్కలు నాటి వాటి సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా సర్పంచ్ లోకోటి సుబ్బారావు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఒక్క మొక్క నాటడం అంటే భవిష్యత్ తరాలకు జీవాన్ని అందించడమేనని పేర్కొన్నారు. పద్మాజివాడి గ్రామాన్ని పచ్చదనంతో నిండిన ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు.మొక్కలు నాటుదాం.. పర్యావరణాన్ని కాపాడుదాం.. పద్మాజివాడిని పచ్చని గ్రామంగా తీర్చిదిద్దుదాం” అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి, వాటిని క్రమం తప్పకుండా సంరక్షించాలని వారు సూచించారు.