పెద్ద చెరువు అలుగు వద్ద బుంగకు మరమ్మతులు
(నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఆగస్టు 12: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని హన్మాజిపేట్ గ్రామంలో పెద్ద చెరువు అలుగు వద్ద ఏర్పడిన బుంగను గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో తక్షణమే పూడ్చి మరమ్మతు పనులు చేపట్టారు. గ్రామ సర్పంచ్ శ్రీమతి ఆశగోనోళ్ల లావణ్య వేంకగౌడ్ ఆధ్వర్యంలో పెద్ద చెరువును పరిశీలించి, అలుగు వద్ద ఏర్పడిన బుంగను గుర్తించారు. చెరువులో నీటి నిల్వలు అధికంగా ఉన్న సమయంలో బుంగ కారణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా వెంటనే మరమ్మతు పనులు చేపట్టారు....