NAMASTE INDUR
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 1:40 pm Posted by : NAMASTE INDUR

పోతంగల్ మండల కేంద్రంలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

పోతంగల్ మండల కేంద్రంలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

నమస్తే ఇందూర్ వార్త / ఆగస్ట్ 15 / కోటగిరి,పోతంగల్:

భారతదేశ చరిత్రలో ఆగస్టు 15వ తేదీకి ఒక ప్రత్యేకమైన భావోద్వేగ స్థానం ఉంది.బ్రిటిష్ సంకెళ్లను తెంచుకుని,స్వేచ్ఛా వాయువులు పీల్చిన ఆ మధుర క్షణాలను తనివితీరా గుర్తుచేసుకునే పర్వదినం ఇది. దేశం తన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతోంది.ఆనాడు దేశ సార్వభౌమత్వాన్ని చాటుతూ ఎర్రకోటపై ఎగిరిన త్రివర్ణ పతాకం,నేడు కూడా కోట్లాది మంది భారతీయుల గుండెల్లో దేశభక్తిని,గర్వాన్ని రగిలిస్తోంది.ఈ మహోజ్వల సంబరాలకు ముందు రోజు,అంటే ఆగస్టు 14న దేశ విభజన నాటి దారుణాలను గుర్తుచేసుకునే ‘విభజన భీభత్స స్మృతి దినం’గా పాటిస్తాం.స్వాతంత్ర్య సంబరాల వెనుక ఎందరో అమాయక ప్రాణాల బలిదానాలు,కుటుంబాల విడిపోయిన వేదన దాగి ఉన్నాయి.ఆ చేదు జ్ఞాపకాలను స్మరిస్తూనే,సాధించుకున్న స్వేచ్ఛ విలువను కాపాడుకోవాలని ప్రతి ఒక్కరి హృదయం ఆకాంక్షిస్తుంది.1947లో మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ప్రారంభించిన ఈ పతాకావిష్కరణ సాంప్రదాయం నేటికీ అప్రతిహతంగా కొనసాగుతోంది.ఈ మహోత్సవం కేవలం ఒక వేడుక మాత్రమే కాదు,నవ భారత నిర్మాణంలో
భాగస్వాములవుతామని ప్రతి పౌరుడు శపథం చేసే పవిత్రమైన సమయం.భరతమాత స్వేచ్ఛా ప్రస్థానం తరతరాల త్యాగాల పునాదులపై నిర్మితమైందని మనకు నిరంతరం గుర్తుచేస్తుంది.
ఈ సందర్భంగా పోతంగల్ గ్రామ పంచాయతీ ముందు సర్పంచ్ సంధ్య(భజరంగ్), మండల తాసిల్దార్ కార్యాలయం ముందు MRO సందీప్,MPDO కార్యాలయం ముందు MPDO చందర్,బస్టాండ్ ఆవరణలో స్వామి వివేకానంద యూత్ అధ్యక్షుడు సుదం భూమయ్య, జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో కల్లూరు భజరంగ్,ఉప సర్పంచ్ నబీ,రమేష్ సెట్,గంధపు పవన్,వర్ని శంకర్,గంట్ల విఠల్, పబ్బ శేఖర్,MA హకీమ్, సూదం నవీన్,గ్రామస్థులు,యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.