NAMASTE INDUR
Newspaper Banner
Date of Publish : 19 August 2026, 3:19 pm Posted by : MEDUDHULA KASHAGOUD

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ..

కామారెడ్డి కేంద్రంలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి
ఆగస్టు 19:

కామారెడ్డి పట్టణ కేంద్రంలో
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫోటోగ్రాఫర్ల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఫోటోగ్రఫీ రంగానికి విశేష సేవలు అందిస్తున్న ఫోటోగ్రాఫర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఫోటోగ్రఫీ ప్రాధాన్యత, సమాజంలో ఫోటోగ్రాఫర్ల పాత్ర, ముఖ్యమైన సంఘటనలను చిత్రాల రూపంలో భద్రపరచడంలో ఫోటోగ్రఫీ రంగం చేస్తున్న సేవలను పలువురు గుర్తుచేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఫోటోగ్రఫీ రంగం మరింత అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు సమీర్, కోశాధికారి నవీన్ యాదవ్, ప్రధాన కార్యదర్శి బద్దం నవీన్, సహాయ కార్యదర్శి పందిరి శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండా నవీన్, మాజీ జిల్లా అధ్యక్షుడు సిరివెన్నెల శీను, జిల్లా కుటుంబ భరోసా ఇన్‌చార్జ్ శ్రావణ్, భూపాల్, సంఘం సభ్యులు శ్రావణ్, తేజ, జమీల్ అన్న తదితర ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు.