ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలి..
-విద్యార్థి సేన ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, నిజాంసాగర్ చౌరస్తాలో ధర్నా (నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి ఆగస్టు 20: కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు సరైన మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సేన ఆధ్వర్యంలో గురువారం భారీ ఆందోళన చేపట్టారు. కళాశాల మైదానం నుంచి నిజాంసాగర్ చౌరస్తా వరకు సుమారు వెయ్యి మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిజాంసాగర్ చౌరస్తాలో విద్యార్థులు బైఠాయించి ధర్నా చేపట్టారు. విద్యార్థుల నినాదాలతో చౌరస్తా మార్మోగింది. వెయ్యి మందికి...