ప్రభుత్వ జూనియర్‌ కళాశాల సమస్యలపై విద్యార్థుల ఆందోళన..

-ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన -ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ ఇంటి ముట్టడికి యత్నం -విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు రోడ్డుపై బైఠాయించి ధర్నా -ఏబీవీపీ నాయకుల అరెస్ట్‌తో ఉద్రిక్తత (నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి ఆగస్టు 21: కామారెడ్డి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు శుక్రవారం ఆందోళనకు దిగారు. కళాశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న మౌలిక వసతులు, విద్యా సౌకర్యాలు, ఇతర సమస్యలను పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు పూర్తిస్థాయిలో పరిష్కారం లభించలేదని...