NAMASTE INDUR
Newspaper Banner
Date of Publish : 25 August 2026, 12:26 pm Posted by : NAMASTE INDUR

బీర్కూర్ తండాలో ఘనంగా వన మహోత్సవం

బీర్కూర్ తండాలో ఘనంగా వన మహోత్సవం

నమస్తే ఇందూర్/: పచ్చని తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవం కార్యక్రమాన్ని బీర్కూర్ తండా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి, వాటి సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కాట్రోత్ దేవిసింగ్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. పచ్చదనం పెంపొందించడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని తెలిపారు.“మొక్క నాటుదాం.. పర్యావరణాన్ని కాపాడుదాం.. భావితరాలకు పచ్చని భవిష్యత్తును అందిద్దాం” అని సర్పంచ్ దేవిసింగ్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దిలీప్, గ్రామ పెద్దలు తుకారాం, సరిచంద్, గోవింద్, రాములు, జయరాం, ఇస్లావత్ సోమ్ ప్రకాష్ తదితరులతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.