NAMASTE INDUR
Newspaper Banner
Date of Publish : 25 August 2026, 1:30 pm Posted by : MEDUDHULA KASHAGOUD

మద్దికుంటలో ఘనంగా వన మహోత్సవం

(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి ఆగస్టు 26:

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం
మద్దికుంట గ్రామంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ముకిడిగండి ప్రాంతంలో గ్రామ సర్పంచ్ తాండ్ర మనీషా రామస్వామి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.గ్రామంలో పచ్చదనం పెంపొందించడంతో పాటు భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు మొక్కల పెంపకం ఎంతో అవసరమని నాయకులు తెలిపారు. నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ముత్యాల రాజు, గ్రామ కార్యదర్శి బండి నరేష్, విలేజ్ అసిస్టెంట్ కమిళ స్వామి, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.