మింగడంలో ఇబ్బందితో బాధపడుతున్న 40 ఏళ్ల వ్యక్తికి అరుదైన చికిత్స

-యశోద వైద్యుల ఆధునిక పి.ఓ.ఈ.ఎం. విధానం విజయవంతం (నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి ఆగస్టు 13: అన్నం, నీరు మింగడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న 40 ఏళ్ల వ్యక్తికి అరుదైన, అధునాతన వైద్య విధానమైన పెరొరల్ ఎండోస్కోపిక్ మయోటమీ (పి.ఓ.ఈ.ఎం.) చికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు యశోద హాస్పిటల్స్ వైద్యులు తెలిపారు. కామారెడ్డి యశోద మెడికల్ సెంటర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైద్యులు చికిత్సకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. చాలా కాలంగా సదరు రోగి ఆహారం, నీరు మింగడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైద్యులు తెలిపారు. తిన్న...