మిషన్ భగీరథ నీటి ట్యాంక్ కింద మురుగు నీరు గ్రామస్తుల ఆందోళన
-కలుషిత తాగునీటితో అనారోగ్య భయం -అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం (నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా జుక్కల్ ఆర్సీ, ఆగస్టు 05: కామారెడ్డి జిల్లా డోంగ్లి మండలం లింబూర్ గ్రామంలో మిషన్ భగీరథ తాగునీటి ట్యాంక్ కింద గత కొన్ని సంవత్సరాలుగా మురుగు నీరు నిల్వ ఉండటంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్యాంక్ పరిసరాల్లో డ్రైనేజీ నీరు నిలిచిపోవడంతో అదే ప్రాంతం నుంచి సరఫరా అయ్యే తాగునీరు కలుషితమవుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో గ్రామ ప్రజలు భయాందోళనలకు గురవుతూ, ఆ నీటిని...