రాష్ట్ర అధ్యక్షుడికి మద్దతుగా భాగ్యనగర్‌కు తరలిన కామారెడ్డి బీజేపీ నాయకులు

(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి ఆగస్టు 26: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు చేపట్టిన 48 గంటల నిరాహార దీక్షకు సంఘీభావంగా కామారెడ్డి పట్టణానికి చెందిన బీజేపీ కౌన్సిలర్లు, నాయకులు పెద్ద ఎత్తున భాగ్యనగర్‌కు తరలివెళ్లారు.‘ఫీజుల బకాయి – బీజేపీ లడాయి’ పేరుతో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు చేపట్టిన రెండు రోజుల నిరాహార దీక్షకు విద్యార్థులు, యువత నుంచి విశేష మద్దతు లభిస్తోందని బీజేపీ నాయకులు...