రోబోటిక్ మోకాలి మార్పిడి సర్జరీతో నెల రోజుల్లోనే సాధారణ జీవితం..
(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి ఆగస్టు 19: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని యశోద హాస్పిటల్ సెంటర్లో డాక్టర్ విక్రమ్ గౌడ్ బైరే విలేకరుల సమావేశంలో బుధవారం మాట్లాడుతూ. మోకాళ్ల నొప్పితో సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న వడ్లూర్‌కు చెందిన పెంటాగౌడ్‌కు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో రోబోటిక్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. శస్త్రచికిత్స జరిగి నెల రోజులు పూర్తికాగా, ప్రస్తుతం ఎలాంటి సహాయం లేకుండా నడవడంతో పాటు తన రోజువారీ పనులను తానే చేసుకుంటున్నట్లు పెంటాగౌడ్ తెలిపారు. పెంటాగౌడ్ మాట్లాడుతూ. గత 5,6. సంవత్సరాలుగా...