వదల్పర్తిలో పామ్ పాండ్‌కు భూమిపూజ
వదల్పర్తిలో పామ్ పాండ్‌కు భూమిపూజ నమస్తే ఇందూర్ నాగిరెడ్డిపేట్, ఆగస్టు 25: నాగిరెడ్డిపేట మండలం వదల్పర్తి గ్రామంలో పామ్ పాండ్ నిర్మాణానికి మంగళవారం ముగ్గు వేసి భూమిపూజ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ సత్యబోయిన పద్మ నారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డీఎల్పీఓ, ఎంపీడీవో, ఏపీవో, ఈసీ, టీఏ, పంచాయతీ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్, జీపీ వర్కర్లు, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో మొక్కలు నాటారు. అనంతరం నాటిన మొక్కలకు నీటిని పోశారు. పర్యావరణ పరిరక్షణతో పాటు...