(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి ఆగస్టు 25:
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం తిప్పారం గ్రామంలో వన మహోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా గ్రామంలో మొక్కలు నాటారు. మొక్కల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని కార్యక్రమంలో పాల్గొన్న వారు పేర్కొన్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ ప్రమాద మాధవరావు మాట్లాడుతూ.. పర్యావరణ సమతుల్యత కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. గ్రామంలో విస్తృతంగా మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ శ్రీహరి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంబరీష్, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ సెక్రటరీ అరుణ్, మహిళా అధ్యక్షురాలు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు, గ్రామస్తులు కూడా కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.