విద్యార్థులతో కలిసి స్టెప్పులేసిన ప్రభుత్వ సలహాదారు హనుమంతరావు..
(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి ఆగస్టు 15: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి. జాతీయ జెండా ఆవిష్కరణ, పోలీసుల గౌరవ వందనం అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు దేశభక్తి, తెలంగాణ సంస్కృతి, గిరిజన సంప్రదాయాలను ప్రతిబింబించేలా పలు నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ముఖ్యంగా గిరిజన పాటలకు విద్యార్థులు చేసిన నృత్యాలు స్టేడియంలో ఉన్న ప్రేక్షకులను విశేషంగా...