విశాల షాపింగ్ మాల్‌లో తప్పిపోయిన బాలుడు..

-పోలీసుల చొరవతో తల్లిదండ్రుల చెంతకు (నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి ఆగస్టు 19: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ ఎక్స్ రోడ్డులోని విశాల షాపింగ్ మాల్‌లో బట్టలు కొనుగోలు చేసేందుకు వచ్చిన కుటుంబానికి చెందిన ఐదేళ్ల బాలుడు అన్విక్ తప్పిపోవడంతో కామారెడ్డి పోలీసులు చొరవ తీసుకుని అతడిని సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. ఇస్రోజివాడికి చెందిన కంచర్ల శంకర్, పావని దంపతులు తమ ఐదేళ్ల కుమారుడు అన్విక్‌తో కలిసి బుధవారం మధ్యాహ్నం సుమారు 1:30 గంటల సమయంలో నిజాంసాగర్ రోడ్డులోని విశాల షాపింగ్ మాల్‌కు...