సర్పంచుల సమస్యలపై కమిషనర్‌కు వినతి పత్రం..
(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి ఆగస్టు 21: సర్పంచులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సంబంధిత కమిషనర్ మేడం ని కలిసి సర్పంచుల ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. గ్రామపంచాయతీల పరిపాలన, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పలు అంశాలను వినతిపత్రంలో ప్రస్తావించారు. ముఖ్యంగా ఉపసర్పంచ్‌లకు చెక్ పవర్, సర్పంచులకు గౌరవ వేతనం చెల్లింపు, గ్రామపంచాయతీల పరిధిలో వినియోగించే విద్యుత్ చార్జీల భారాన్ని తగ్గించడం వంటి సమస్యలను పరిష్కరించాలని కోరారు. అదేవిధంగా గ్రామపంచాయతీలు వసూలు చేస్తున్న ట్యాక్స్‌ల ద్వారా వచ్చిన నిధులను ప్రైవేట్ బ్యాంకు ఖాతాల్లో...