హరిత గ్రామాలే లక్ష్యంగా వన మహోత్సవం
(నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా జుక్కల్ ఆర్‌సీ, ఆగస్టు 25: పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలంటే విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని తడిహిప్పర్గ గ్రామ సర్పంచ్ అశ్విని సుదర్శన్ కంకర్నె అన్నారు.వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మద్నూర్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో మంగళవారం ఆయా గ్రామాల సర్పంచుల ఆధ్వర్యంలో పెద్దఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తడిహిప్పర్గ గ్రామంలో సర్పంచ్ అశ్విని సుదర్శన్...