22 ప్యాకేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను వెంటనే పూర్తి చేయాలి: టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ తాహెర్
(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 5: కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూoపల్లి పల్లి గ్రామం సమీపంలో నిలిచిపోయిన 21, 22 ప్యాకేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను తక్షణమే పూర్తి చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ తాహెర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం పార్టీ నాయకులతో కలిసి ప్రాజెక్టు పనులను పరిశీలించిన ఆయన, పనులు మధ్యలోనే నిలిచిపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి పనుల పురోగతిని పరిశీలించిన మహమ్మద్...