రహదారిపై నీటి కుంటలో కౌన్సిలర్ నిరసన!
రహదారిపై నీటి కుంటలో కౌన్సిలర్ నిరసన! స్టేషన్ రోడ్డులో వరద నీటితో కుంటను తలపిస్తున్న ప్రధాన రహదారి ట్రాఫిక్ జామ్‌తో వాహనదారుల అవస్థలు.. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే 108 వాహనాలకూ తీవ్ర ఇబ్బందులు నమస్తే ఇందూర్/కామారెడ్డి టౌన్, ఆగస్టు 8: కామారెడ్డి జిల్లా కేంద్రంలో కురిసిన భారీ వర్షాలకు ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. కామారెడ్డి–కరీంనగర్ ప్రధాన రహదారిలోని స్టేషన్ రోడ్డులో పోలీస్ స్టేషన్ ఎదుట భారీగా వరద నీరు నిలిచిపోవడంతో రహదారి కుంటను తలపిస్తోంది. నీరు వెళ్లేందుకు సరైన మార్గం లేకపోవడంతో వాహనదారులు, పాదచారులు...