NAMASTE INDUR
Newspaper Banner
Date of Publish : 25 August 2026, 2:52 pm Posted by : NAMASTE INDUR

గొల్లపల్లిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

గొల్లపల్లిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

నమస్తే ఇందూర్/రామారెడ్డి 

గొల్లపల్లి: గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, జీపీ సెక్రటరీ శ్రీకాంత్, గ్రామ కార్యదర్శి పాపిరెడ్డితో పాటు గ్రామస్తులు రాజయ్య, లక్ష్మి, మల్లేష్ యాదవ్, సంగయ్య, కమ్మర్ దేవయ్య, ఉషాశ్రీ, వనజ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందే ప్రయోజనాలు అర్హులైన కుటుంబాలకు మరింత సులభంగా అందనున్నాయని ఈ సందర్భంగా తెలిపారు. కార్డుల పంపిణీతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.