గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో భాగస్వామ్యమైన అబ్దుల్ నుమాన్‌కు ఘన సన్మానం
నమస్తే ఇందూర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెప్టెంబర్ 16
పాల్వంచ, : చిన్న వయసులోనే కరాటే రంగంలో ప్రతిభను చాటుతూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్లో భాగస్వామ్యమైన పాల్వంచకు చెందిన బాల కరాటే క్రీడాకారుడు ఎస్.కె. అబ్దుల్ నుమాన్ను ఆయన చదువుతున్న లిటిల్ ఫ్లవర్ స్కూల్, పాల్వంచలో మంగళవారం ఘనంగా సన్మానించారు.
హైదరాబాద్‌లో 2026 ఏప్రిల్ 26న నిర్వహించిన కార్యక్రమంలో 1,212 మంది పాల్గొన్న అతిపెద్ద కరాటే ప్రదర్శన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్‌గా నమోదైంది. ఈ కార్యక్రమంలో అబ్దుల్ నుమాన్ పాల్గొని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికెట్ అందుకోవడం పట్ల పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ మూడ్ గణేష్ గారు ముఖ్య అతిథిగా హాజరై అబ్దుల్ నుమాన్ను ఘనంగా సత్కరించారు. చిన్న వయసులోనే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో భాగస్వామ్యం కావడం అభినందనీయమని, తన ప్రతిభతో పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకువచ్చిన అబ్దుల్ నుమాన్ను ఆయన అభినందించారు. భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని ఆశీర్వదించారు.
లిటిల్ ఫ్లవర్ స్కూల్ కరస్పాండెంట్ ఎం. కృష్ణ అబ్దుల్ నుమాన్ సాధించిన ఘనతపై సంతోషం వ్యక్తం చేస్తూ, విద్యతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించడం పాఠశాలకు గర్వకారణమని అన్నారు. అబ్దుల్ నుమాన్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
అబ్దుల్ నుమాన్ కరాటేలో శిక్షణ పొందుతున్న నవోదయ కరాటే ఇన్స్టిట్యూట్, పాల్వంచ మాస్టర్ ఎ. రాంబాబు గారు కూడా ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు. అబ్దుల్ నుమాన్ కృషి, పట్టుదల అభినందనీయమని, భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పలువురు కార్పొరేటర్లు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని అబ్దుల్ నుమాన్ను అభినందించారు. చిన్న వయసులోనే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో భాగస్వామ్యం కావడం పట్ల అందరూ ఆనందం వ్యక్తం చేశారు.
అబ్దుల్ నుమాన్ తల్లిదండ్రులు అబ్దుల్ రహమాన్, ఆయేషా ఫిర్దోస్ మాట్లాడుతూ, తమ కుమారుడు సాధించిన ఈ ఘనత పట్ల ఎంతో సంతోషంగా, గర్వంగా ఉందని తెలిపారు. తమ కుమారుడిని ప్రోత్సహిస్తున్న పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, మాస్టర్ ఎ. రాంబాబు కి, అలాగే కార్యక్రమానికి హాజరై అభినందించిన ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.
అబ్దుల్ నుమాన్ భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించి పాల్వంచకు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు, తెలంగాణ రాష్ట్రానికి మరింత మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా పలువురు ఆకాంక్షించారు.