తెలంగాణ రాష్ట్ర సంక్షేమమే ఆర్ఎస్పీ పార్టీ ప్రధాన లక్ష్యం
-ఆర్ఎస్పీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జాకట శ్రీనివాస్
మేడ్చల్ సెప్టెంబర్ 02 ప్రతినిధి :-
తెలంగాణ రాష్ట్ర సంక్షేమ నిర్మాణంలో ప్రభుత్వ అధికారులు,ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని రాష్ట్ర సామాన్య ప్రజా పార్టీ (RSP పార్టీ) వ్యవస్థాపక అధ్యక్షుడు, కంటెస్టెడ్ మేడ్చల్ ఎమ్మెల్యే జాకట శ్రీనివాస్ పిలుపునిచ్చారు.బుధవారం మేడ్చల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…”ఆర్.ఎస్.పి పార్టీ ప్రధాన లక్ష్యం తెలంగాణ సంక్షేమమనీ,తెలంగాణ సంక్షేమ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నదే తమ పార్టీ సిద్ధాంతమని స్పష్టం చేశారు.”ప్రభుత్వ పథకాలు పేద,మధ్యతరగతి ప్రజలకు పూర్తిగా అందడం లేదనీ ప్రజలకు,ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉన్న అధికారులు పార్టీలకు అతీతంగా,రాజ్యాంగబద్ధంగా,నిష్పక్షపాతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.సామాన్యుడి వినతులను సత్వరమే పరిష్కరించి,అవినీతికి తావులేకుండా చూడాలని ఈసందర్భంగా” అని ఆయన కోరారు.