మహిళల ఆధ్వర్యంలో ఘనంగా వినాయక సేన 6వ వార్షికోత్సవం..
-వైభవంగా గణనాథునికి పూజలు (నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి సెప్టెంబర్ 22: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి 10వ వార్డులో కురుమ సంఘం ఆధ్వర్యంలో వినాయక సేన 6వ వార్షికోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. ప్రత్యేకంగా మహిళలే ముందుండి గణనాథుడిని ప్రతిష్ఠించి ప్రతి ఏడాది వినాయక ఉత్సవాలను నిర్వహించడం విశేషంగా నిలుస్తోంది.మహిళల ఆధ్వర్యంలో గణపయ్యను ప్రతిష్ఠించి ఉత్సవాలను నిర్వహించడం స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా మారింది. ప్రతిరోజూ గణనాథుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, మంగళహారతులు నిర్వహిస్తుండగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. గణపయ్య ఆశీస్సులతో...