మామూళ్లు ఇచ్చుకో.. ఇసుక తోడేసుకో..

-అధికారుల కనుసైగల్లోనే అక్రమ ఇసుక దందా..? -రాత్రివేళల్లో మంజీరా నదిలో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు -మహారాష్ట్ర, కర్ణాటకకు తరలింపు ప్రభుత్వ ఆదాయానికి గండి (నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా జుక్కల్ ఆర్సీ సెప్టెంబర్ 01: పి. నాగభూషణ్ ఉమ్మడి మద్నూర్, డోంగ్లి మండలాల్లో అక్రమ ఇసుక దందా జోరుగా సాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. డోంగ్లి మండలం సిర్పూర్ గ్రామ పరిధిలోని మంజీరా నది పరివాహక ప్రాంతం అక్రమ ఇసుక రవాణాకు కేంద్రంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రతిరోజూ రాత్రివేళల్లో సుమారు 15 ట్రాక్టర్ల ద్వారా...