లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ

(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి ఆగస్టు 01: లయన్స్ క్లబ్ కొంపల్లి లైఫ్ స్పేసెస్ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని దేవునిపల్లి, దత్త బస్తీల్లో నిర్వహిస్తున్న సంస్కార కేంద్రాల విద్యార్థులకు శనివారం నోటు పుస్తకాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ చీల రాము మాట్లాడుతూ, శ్రీ సరస్వతీ విద్యా మందిర్ హై స్కూల్ ఆధ్వర్యంలో బస్తీల్లోని చిన్నారులకు ఉచితంగా విద్యతో పాటు సంస్కారం, సదాచారం, క్రమశిక్షణను అందించే కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. సమాజంలో వెనుకబడిన వర్గాల పిల్లలకు విద్య అందించడం గొప్ప సేవ అని...