శ్రీచైతన్య పాఠశాలలో గిరిజన విద్యార్థుల సమస్యలపై అధికారుల తనిఖీ..
-భోజనంలో నాణ్యత లేదని విద్యార్థుల ఫిర్యాదు -మేనేజ్‌మెంట్‌పై చర్యలు (నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 1: కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామంలోని శ్రీచైతన్య కార్పొరేట్ హైస్కూల్‌లో బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం కింద చదువుతున్న ఎస్టీ బాలబాలికల సమస్యలను జిల్లా అధికారులు మంగళవారం పరిశీలించారు. గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు చౌహాన్ వినోద్ నాయక్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి (డి.టి.డి.ఓ.)సౌజన్య మేడం పాఠశాలను సందర్శించి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు.ఈ సందర్భంగా...