ఢిల్లీ రామ్లీలా మైదానంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కార్యక్రమం.. జిల్లా నుంచి భారీగా తరలివెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు
నమస్తే ఇందూర్ ప్రతినిధి: ప్రజాస్వామ్య, రాజ్యాంగ పరిరక్షణ లక్ష్యంగా ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో నిర్వహించిన ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇప్ప శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్కతో కలిసి కార్యక్రమంలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. జిల్లా నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఢిల్లీకి తరలివెళ్లి కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.ఈ సందర్భంగా ఇప్ప శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థను, రాజ్యాంగ విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. ఓటు హక్కు అనేది రాజ్యాంగం పౌరులకు కల్పించిన శక్తివంతమైన హక్కు అని, దాని పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. ప్రజల హక్కులు, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న ఇటువంటి కార్యక్రమాల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, భీమ్ రెడ్డి, రాజ్ పాటిల్, గొనె శ్రీనివాస్, చాట్ల రాజేశ్వర్, నాగరాజు గౌడ్, పాత రాజు, శ్రీనివాస్ తదితర నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.