విద్యార్థులకు పోలీస్ స్టేషన్ పనితీరుపై అవగాహన..
-మత్తు పదార్థాలు, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్‌హెచ్‌ఓ నరసింహారావు (నమస్తే ఇందూర్) వరంగల్ జిల్లా ఎల్కతుర్తి, నవంబర్ 04: విద్యార్థులకు పోలీస్ వ్యవస్థ పనితీరు, పోలీసుల విధులు, చట్టాలు, సామాజిక బాధ్యతలపై అవగాహన కల్పించేందుకు ఎల్కతుర్తి పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం శాంతినగర్‌లోని సెంటాన్ హైస్కూల్ విద్యార్థులకు బుధవారం ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) నరసింహారావు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్‌హెచ్‌ఓ మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులను క్షుణ్ణంగా...