పెద్దారెడ్డిపేట్ గ్రామంలో గణపతి నిమార్జన మహోత్సవం
సంగారెడ్డి సెప్టెంబర్ 04 (నమస్తే ఇందూర్) పుల్కల్ మండలంలోని పెద్దారెడ్డి పెట్ గ్రామంలో వినాయక నవ రాత్రులు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు అను నిత్యం వేదపండితులచే ఉదయం సాయంత్రం వేళల్లో దంపతులచే పూజ కార్యక్రమలు ఘనంగా నిర్వహించారు. నవరాత్రులు పురస్కరించుకొని మల్లికార్జున యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన మండపము వద్ద మొదటి రోజు నుండి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో కుటుంబ
సమేతంగా పూజలో పాల్గొన్నారు. మల్లికార్జున యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు తొమ్మిదవ రోజు వినాయక పూజలు చేసి నిమర్జనం వాహనాన్ని ముస్తాబ్ చేసి భాజా భజంత్రీలతో చిన్నపిల్లలకు కోలాటాలు వాడుతూ రంగ రంగ వైభవంగా తిరుగుతూ వినాయకుడిని సింగూర్ ప్రాజెక్ట్ సమీపంలోకి తీసుకెళ్లి నిమజ్జనం ఘనంగా చేశారు. మల్లికార్జున యూత్ సభ్యులు మాట్లాడుతూ పెద్ద రెడ్డి పేట్ గ్రామ ప్రజలు ఎల్లవేళల సుఖసంతోషాలతో ఉండాలని మీ వినాయకుని కోరుకున్నామని ప్రతి సంవత్సరం వినాయకుడి పూజలు ఘనంగా నిర్వహిస్తూ అన్నదాన కార్యక్రమం చేస్తూ ముందుకు వెళ్తామని తెలియజేశారు.ఈ నిమజ్జన కార్యక్రమంలో కల్లపల్లి రవి, పత్తి కృష్ణ, కలాలి మల్లేశం గౌడ్, ఉత్తెరపల్లి రాజు, ఎల్లప్ప ఆంజనేయులు, పర్వేగారి సతీష్ కుమార్, ఎల్లప్ప రమేష్, పత్తి వినోద్, శివ తేజ, మల్లేశం, శ్రీశైలం, శివరాం, నరేష్, మహేష్, కార్తీక్,గ్రామ ప్రజలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


