హనుమకొండలో సేవాలాల్ సేన జెండా ఆవిష్కరణ
సేవాలాల్ మహారాజ్ ఆలోచనలు సమాజానికి దిశానిర్దేశం
జిల్లా అధ్యక్షులు సిద్దు నాయక్
నమస్తే ఇందూర్: హనుమకొండ
హనుమకొండ పబ్లిక్ గార్డెన్ గ్రంథాలయం ఎదురుగా సేవాలాల్ సేన ఆధ్వర్యంలో ఘనంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు సిద్దు నాయక్ అధ్యక్షత వహించారు. జెండా ఆవిష్కరణ అనంతరం సభలో నాయకులు మాట్లాడారు. సేవాలాల్ మహారాజ్ ఆలోచనలు, బోధనలు నేటి తరానికి దిశానిర్దేశంగా నిలుస్తాయని వారు పేర్కొన్నారు. సమాజంలో ఐక్యత, సోదరభావం, విద్యా అభివృద్ధి పట్ల ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. యువత సమాజ మార్పులో కీలకపాత్ర పోషించాల్సిన అవసరం ఉందని, సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గం ఈ తరానికి ప్రేరణనిచ్చేదని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు సేవాలాల్ ఆంగోతి సుధాకర్ నాయక్, భూక్యా సంజీవ్ నాయక్, బానోతు హుస్సేన్ నాయక్, మానవత్ శంకర్ నాయక్, పోకిరి హర్షిత నాయక్, అంగోత్రి శ్రీనివాస్ నాయక్, బానోత్ గద్దర్ నాయక్, బాదావత్ ప్రదీప్ నాయక్, మాలోతు వీరన్న నాయక్, బోడ బాలు నాయక్, మాలోతి తిరుపతి నాయక్, తిరుపతి నాయక్, అనిల్ నాయక్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.





