దేశ నిర్మాణం దిశగా యువతలో స్ఫూర్తిని నింపనున్న సర్దార్ @150 యూనిటీ మార్చ్: కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి
నమస్తే ఇందూర్,హైదరాబాద్, అక్టోబరు 17:
సర్దార్@150 యూనిటీ మార్చ్‌లో చురుకుగా పాలుపంచుకోవాల్సిందిగా యువతకు, విద్యార్థులకు, ప్రజా ప్రతినిధులకు, తెలంగాణ పౌరులకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ఈ రోజు విజ్ఞప్తి చేశారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్‌భాయి పటేల్ 150వ జయంతిని స్మరించుకోవడానికి సర్దార్@150 యూనిటీ మార్చ్‌ను మేరా యువ భారత్ (MY Bharat) పోర్టల్ నేతృత్వంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.
స్థానిక కవాడిగూడలోని సీజీఓ టవర్స్‌లో శుక్రవారం నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి ప్రసంగించారు. నిస్వార్థ సేవ, ఏకత, దేశ నిర్మాణం వంటి ఆదర్శ భావనలకు సర్దార్ పటేల్ మార్గదర్శకత్వం వహించారనీ, ఈ భావనలకు ప్రతీకగా జాతీయ స్థాయిలో చేపట్టే కార్యక్రమాల్లో యువత ముందువరుసలో నిలవాలనీ శ్రీ కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఇండియన్ యూనియన్‌లో హైదరాబాద్ విలీనం కావడంలో సర్దార్ పటేల్ చరిత్రాత్మకమైన పాత్రను పోషించారని శ్రీ కిషన్ రెడ్డి ముఖ్యంగా ప్రస్తావించారు. ‘‘ఆయన దార్శనికతతో, దృఢసంకల్పంతో పూనుకోకపోతే భారత్‌లో హైదరాబాద్ విలీనం సాధ్యమయ్యేదే కాదు’’ అని మంత్రి స్పష్టం చేశారు.
సర్దార్ వల్లభ్‌భాయి పటేల్ జీవితం, నాయకత్వం అందించిన స్ఫూర్తితో జాతీయ సమగ్రత, ఏకత, యువజన భాగస్వామ్యం వంటి ఆదర్శభావనలను ఒక ఉత్సవంగా జరుపుకొనే కార్యక్రమమే సర్దార్@150 యూనిటీ మార్చ్ అని మంత్రి అభివర్ణించారు.ఎమ్ వై భారత్ తెలంగాణ స్టేట్ డైరెక్టర్ (ఇన్‌ఛార్జి) శ్రీ అన్షుమన్ ప్రసాద్ దాస్, ఎన్ఎస్ఎస్ ప్రాంతీయ డైరెక్టర్ హైదరాబాద్ శ్రీ ఎం. రామకృష్ణ కూడా విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.నేపథ్యం సర్దార్@150 యూనిటీ మార్చ్‌లో భాగంగా తెలంగాణ అంతటా యువతను భాగస్వాములను చేస్తూ రాబోయే రెండు నెలల్లో పాదయాత్రలు, ప్రతిజ్ఞా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భారత్‌ను సమైక్యపరచడంలో సర్దార్ పటేల్ అందించిన సుదీర్ఘ వారసత్వాన్ని గౌరవించుకొంటూ, యువజనుల్లో ఏకత, దేశభక్తి, పౌర బాధ్యత భావనలను నింపాలన్నదే ఈ కార్యక్రమం సంకల్పంగా ఉంది.
దేశ నిర్మాణంలో ప్రజలను భాగస్వాములను చేయాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత నుంచి ప్రేరణను పంది, యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ‘మై భారత్’ సహకారంతో ‘వికసిత్ భారత్ పాదయాత్రల’ను ఏర్పాటు చేస్తోంది. ఈ యాత్రలను దేశాభిమానాన్ని పెంచడానికీ, ఏకతను బలపరచడానికీ యువత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికీ దేశం నలుమూలలా నిర్వహిస్తున్నారు.ఈ దార్శనికతలో ఓ విడదీయరాని భాగమే సర్దార్@150 యూనిటీ మార్చ్‌లు. ఇవి ‘ఏక్ భారత్, ఆత్మనిర్భర్ భారత్’ ఆదర్శ భావనలను యువజనులు తమ దైనందిన జీవనంలో పాటించేలా వారిలో ప్రేరణను కలిగిస్తాయి.ఈ ప్రచారోద్యమాన్ని డిజిటల్ మాధ్యమం ద్వారా ఈ నెల 6న మొదలుపెట్టారు. దీనిలో భాగంగా సామాజిక మాధ్యమాల్లో రీల్ పోటీలు, వ్యాస రచన పోటీలతో పాటు సర్దార్@150 యువ నాయకుల కార్యక్రమం, 15 ఏళ్ల మొదలు 29 ఏళ్ల వయస్సు వారికి క్విజ్ పోటీ వంటి కార్యక్రమాలు ఉంటాయి.మొదటి దశలో ఈ నెల 31 నుంచి నవంబరు 25వ తేదీ వరకు జిల్లా స్థాయి పాదయాత్రలు చేపడుతారు. ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలోనూ వరుసగా మూడు రోజుల పాటు వీటిని నిర్వహిస్తారు. దేశంలో అన్ని జిల్లాల్లో ప్రతి రోజూ 8 నుంచి 10 కి.మీ. మేర పాదయాత్ర చేయనున్నారు


