గర్భిణీ మహిళకు రక్తదానం చేసిన చీల గోపి
-జిల్లా రక్తదాతల సేవాసమితి
నిర్వాహకులు
-బోనగిరి శివకుమార్
ముదాం శ్రీధర్ పటేల్
నమస్తే ఇందూర్ కామారెడ్డి ప్రతినిధి అక్టోబర్ 30:
కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వేద అనే గర్భిణీకి అత్యవసరంగా ఆపరేషన్ నిమిత్తమై ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు జిల్లా రక్తదాతల సేవా సమితి నీ సంప్రదించడంతో ఒక్క ఫోన్ చేయగానే స్పందించిన కామారెడ్డి పట్టణానికి చెందిన చీల గోపి సహకారంతో వారికీ కావాల్సిన ఓ పాజిటివ్ రక్తం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సేవా సమితి నిర్వాహకులు మాట్లాడుతూ ఎవరికైనా రక్తం అవసరం ఉంది అనీ మెసేజ్ గాని ఫోన్ గాని రాగానే 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరు రక్తదానంకు ముందుండాలని కోరారు. రక్తదాతకు జిల్లా రక్తదాతల సేవా సమితి నిర్వాహకులు బోనగిరి శివకుమార్ ముదాం శ్రీధర్ పటేల్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లడ్ సెంటర్ ప్రతినిధులు పాల్గొన్నారు.



