(నమస్తే ఇందూరు)హైదరాబాద్ డెస్క్
నవంబర్ 15
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కామారెడ్డి నగర శాఖ ఆధ్వర్యంలో స్థానిక వశిష్ట డిగ్రీ కళాశాలలో ఈ కార్యక్రమాని ఉద్దేశించి ఈ కార్యక్రమానికి వక్త గా వచ్చిన ఏబీవీపీ నగర అధ్యక్షులు డాక్టర్ ఏనుగు అనిల్ రెడ్డి మాట్లాడుతూ. భారత స్వతంత్ర సమరచరిత్రలో గాంధీజీ సుభాష్ చంద్రబోస్ అల్లూరి సీతారామరాజు వంటి మాహానియుల కోవకు చెందిన ఆదివాసి వీరుడు భగవాన్ బీర్సా ముండా 1875 నవంబర్ 15న జార్ఖండ్‌లోని వులిహాటు గ్రామంలో జన్మించిన ఆయన కేవలం 25 ఏళ్ల వయసులోనే బ్రిటిష్ వారి వ్యతిరేక పోరాటంలో తుది శ్వాస విడిచారు, బ్రిటిష్ పాలకులు సైనిక దౌర్జన్యంతో తప్పుడు ప్రచారంతో గిరిజన సమాజాన్ని బలహీనపరచడానికి ప్రయత్నించిన తరుణంలో యువకుడిగా బీర్సా ముండా ఈ దోపిడిని త్వరగా గ్రహించి మన దేవుడు ప్రకృతిలో ఉన్నాడు మన భూమి మన తల్లి దాన్ని ఎవరు దోచుకోలేరు అని ప్రచారం ప్రారంభించి గిరిజన హృదయాల్లో విప్లవాన్ని రగిలించి ఆదివాసి హక్కుల కోసం విప్లవం చేయడం జరిగింది. బిర్సా ముండా కేవలం తిరుగుబాటుదారుడు కాదు ఒక సాంస్కృతిక పునరుద్జీవకారుడు, 1899 డిసెంబర్లో ఉల్గులను విప్లవం ప్రారంభించినాడు దీనిలో వందలాది మంది గిరిజనులు వీరవరం పొందారు చివరికి బీర్సా పట్టుబడ్డలతో రాంచీ జైల్లో పెట్టారు 1900 జూన్ 9వ తేదీన తన 25 ఏట జైల్లో అమరుడయ్యాడు బీర్సా ముండా జయంతి ప్రాముఖ్యతను గుర్తించిన భారత ప్రభుత్వం 2021 లో ఆయన జయంతిని జన జాతి గౌరవ దినోత్సవం గా ప్రకటించింది.. ఆదివాసి ఆత్మగౌరవ పతాక బీర్సా ముండా స్ఫూర్తిని నేటి యువత అందిపుచ్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా సంఘటన కార్యదర్శి రాపాక సాయి, జిల్లా ఎస్.డి.ఎఫ్. కన్వినర్ సూర్య, మహిళా నాయకురాలు దుర్గ, ఆజార్, కోషిక్, కృష్ణ, అక్షయ్, చరణ్, రాము, విద్యాసాగర్ తదితరులు విద్యార్థి నాయకులు పాల్గొనడం జరిగింది తేదీన తన 25 ఏట జైల్లో అమరుడయ్యాడు బీర్సా ముండా జయంతి ప్రాముఖ్యతను గుర్తించిన భారత ప్రభుత్వం 2021 లో ఆయన జయంతిని “జన జాతి గౌరవ దినోత్సవం” గా ప్రకటించింది.. ఆదివాసి ఆత్మగౌరవ పతాక బీర్సా ముండా స్ఫూర్తిని నేటి యువత అందిపుచ్చు కోవాలన్నారు.





