సర్పంచ్ ఎన్నికలపై రెడ్ అలర్ట్
గీసుగొండపై పోలీసుల నిఘా
నమస్తే ఇందూర్: గీసుకొండ
సర్పంచ్ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు గీసుకొండ పోలీస్ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఎన్నికల ఆచార నియమావళి (ఎంసీసీ) అమలులో ఉన్న నేపథ్యంలో చట్ట విరుద్ధ చర్యలకు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేసి పలు కీలక సూచనలు అనుమతి లేని ర్యాలీలు, సభలు పూర్తిగా నిషేధం , రాత్రి 10 తర్వాత ఎన్నికల ప్రచారానికి అనుమతి లేదు ,డబ్బు, మద్యం, బహుమతులతో ఓటర్లను ప్రలోభపెట్టడం నేరం, ప్రభుత్వ భవనాలపై పోస్టర్లు–ఫ్లెక్సీలు పెట్టినా కేసులు, ఆయుధాలు కలిగి తిరిగినా, వాహనాల్లో తీసుకెళ్లినా కఠిన చర్య,పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో ప్రచారం నిషేధం సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు, ఫేక్ న్యూస్‌పై నిఘా వాట్సాప్, ఫేస్బుక్ గ్రూప్ అడ్మిన్లు బాధ్యతతో వ్యవహరించాలి ఎన్నికల సమయంలో అనుమానాస్పద కదలికలు, హింసాత్మక చర్యలు, విపరీత ప్రచారం గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.
*గీసుకొండ సీఐ డి. విశ్వేశ్వర్ హెచ్చరిక*
ఎన్నికల శాంతి భద్రత కోసం చట్టం ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు

