*నాయకుల ఆధ్వర్యంలో వినాయకపురం బీ ఆర్ ఎస్ ప్రచారం ఉద్ధృతం!*
అభివృద్ధికి ఉంగరం గుర్తుకు ఓటు వేసిబీ ఆర్ ఎస్ అభ్యర్థిని గెలిపించండి: జుజ్జురి వెంకన్నబాబు
ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేసిన కొవ్వాసి దీవెన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా , డిసెంబర్ 10 (నమస్తే ఇందూర్) అశ్వారావుపేట మండలం, వినాయకపురం గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం బుధవారం ఉద్ధృత రూపం దాల్చింది. ఈ ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కొవ్వాసి దీవెన గెలుపు కోసం మండల నాయకులు, సీనియర్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు.ఇంటింటికీ తిరిగి, ఓటర్లను కలిసి బీ ఆర్ ఎస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
ఈ విస్తృత స్థాయి ప్రచార కార్యక్రమంలో మండల అధ్యక్షులు జుజ్జురి వెంకన్నబాబు, సీనియర్ నాయకులు మోహన్ రెడ్డి, బీ ఆర్ ఎస్ అశ్వారావుపేట నియోజకవర్గ నాయకురాలు వగ్గేల పూజ పాల్గొన్నారు. వారు కొవ్వాసి దీవెన కి మద్దతుగా ప్రసంగిస్తూ, వినాయకపురం సమగ్ర అభివృద్ధికి దీవెన గెలుపు అత్యంత అవసరమని ఉద్ఘాటించారు.
జుజ్జురి వెంకన్నబాబు మాట్లాడుతూ, బీ ఆర్ ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిరంతరాయంగా గ్రామస్థులకు అందాలంటే, పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. “గ్రామాభివృద్ధి లక్ష్యంగా పనిచేసే వ్యక్తి దీవెన. ఆమెను గెలిపిస్తేనే గ్రామం ప్రగతి పథంలో పయనిస్తుంది,” అని అన్నారు.
వగ్గేల పూజ మాట్లాడుతూ, మహిళా అభ్యర్థిగా దీవెన గెలిపిస్తే, గ్రామ సమస్యల పరిష్కారంలో మరింత క్రియాశీలకంగా వ్యవహరిస్తారని, మహిళల సమస్యలను ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరిస్తారని తెలిపారు.
ఈ సందర్భంగా దీవెన మాట్లాడుతూ, ముందుగా మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కు మరియు వినాయకపురం గ్రామ ప్రజలకు తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.గ్రామ ప్రజలందరూ ఉంగరం గుర్తుకు ఓటు వేసి, తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె అభ్యర్థించారు.తాను సర్పంచ్‌గా ఎన్నికైతే, గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి కోసం అంకితభావంతో కృషి చేస్తానని, ప్రతి ఒక్కరి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. యువత, మహిళలు మరియు వృద్ధుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.
నాయకుల ప్రచారంతో గ్రామస్థులలో నూతన ఉత్సాహం కనిపించింది. నాయకులు ప్రతి గడపకూ తిరిగి, BRS ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించి, ఈ ఎన్నికల్లో ఉంగరం గుర్తుకు ఓటు వేసి దీవెనని భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు.

