సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా వారు సేవలు మరువలేనివి.
మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా ఆమె సేవలు చిరస్మరణీయం.
సంగారెడ్డి జిల్లా/ నమస్తే ఇందూర్ / జనవరి 3 / ఆందోల్ నియోజకవర్గం రిపోర్టర్ నాగరాజు
నెహ్రూ మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జోగిపేట యందు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్.పి .రమేష్ సార్ గారి అధ్యక్షతన, ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలో *సావిత్రిబాయి పూలే గారి 195 వ* జయంతి సందర్భంగా *మహిళా ఉపాధ్యాయుల* దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ముందుగా కళాశాలలోని మహిళా అధ్యాపకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. సావిత్రిబాయి పూలే వంటి వారిని ఆదర్శంగా తీసుకొని చదువుతోపాటు అన్ని రంగాలలో నైపుణ్యాన్ని సాధిస్తూ మహిళలు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలియజేయడం జరిగింది. మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం పురస్కరించుకొని కళాశాలలోని విద్యార్థిని విద్యార్థులకు *వ్యాసరచన మరియు ఉపన్యాస* పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపాల్ మరియు అధ్యాపకుల చేత విద్యార్థులకు బహుమతి ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ విభాగం అధ్యాపకురాలు ఎం. సంధ్యా మేడం గారు, వాణిజ్య విభాగం అధ్యాపకులు డాక్టర్. జి .పండరి సార్ గారు, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్. సిహెచ్. శ్రీకాంత్ గారు, ఆంగ్ల విభాగ అధ్యాపకురాలు బి. రాజేశ్వరి గారు, డి.కీర్తన గారు, ఇతర అధ్యాపక మరియు అధ్యాపకేతర బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది.


