బిచ్కుందలో సర్పంచులు–ఉపసర్పంచుల ఆత్మీయ సమ్మేళనం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు నేతృత్వం డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ముఖ్య అతిథి
జుక్కల్ ప్రతినిధి పండు వారి నాగభూషణం నమస్తే ఇందూర్ న్యూస్ దినపత్రిక 4 జనవరి
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మండల కేంద్రంలో గల బండయప్ప ఫంక్షన్ హాల్ లో ఈరోజు జుక్కల్ నియోజకవర్గం లోని సర్పంచులు, ఉపసర్పంచుల కోసం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం అత్యంత ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమాన్ని జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతరావు స్వయంగా నేతృత్వం వహించి నిర్వహించగా, నియోజకవర్గ అభివృద్ధి దిశగా ఆయన చూపిన చొరవ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ సమ్మేళనానికి కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు శ్రీ ఏలే మల్లికార్జున్ ముఖ్య అతిథిగా హాజరై, కార్యక్రమానికి రాజకీయ ప్రాధాన్యతను పెంచారు.ఈ సందర్భంగా మాట్లాడిన డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ గ్రామ పాలనకు వెన్నెముకలైన సర్పంచులు, ఉపసర్పంచుల సేవలు అమూల్యమైనవి. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు నాయకత్వంలో జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధి బాటలో వేగంగా అడుగులు వేస్తోంది” అని పేర్కొన్నారు.అనంతరం ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ,
గ్రామ స్థాయిలో ప్రజాప్రతినిధులు సమిష్టిగా పనిచేస్తేనే నిజమైన అభివృద్ధి సాధ్యం. సర్పంచులు, ఉపసర్పంచుల సహకారంతో జుక్కల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలబెడతాం” అని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమం మొత్తం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు చొరవ, డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ మార్గదర్శనం లో స్నేహపూర్వక వాతావరణంలో సాగి, సర్పంచులుఉపసర్పంచుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది


