మున్సిపల్ ఎన్నికల పై ముందస్తు సమావేశం. :- కమిషనర్ రవీందర్
సంగారెడ్డి జిల్లా/ నమస్తే ఇందూర్ / జనవరి 5/ ఆందోల్ జోగిపేట మున్సిపాలిటీ రిపోర్టర్ నాగరాజు
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మునిసిపల్ సాధారణ ఎన్నికల నిర్వహణ కొరకు సోమవారం నాడు అందోల్ జోగిపేట మున్సిపల్ ఆఫీస్ లో ముందస్తు సమావేశం కమిషనర్ రవీందర్ నిర్వహించారు. ఓటరు డ్రాఫ్ట్ రోల్ ను మునిసిపల్ కార్యాలయములో విడుదల చేశారు. ఈ జాబితాలను తేదీ 05.01.2026 వరకు అభ్యతరాలను స్వీకరించుటకు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం నాడు మునిసిపల్ పరిధి లోని గుర్తింపు పొందిన రాజకీయ ప్రజా ప్రతినిధులతో సమా వేశం ఏర్పాటు చేశారు. ఈ సమా వేశానికి వివిధ రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులు, పాల్గొన్నారు.





