సంగారెడ్డి: పతంగి ఎగరేస్తుండగా బాలుడికి కరెంట్ షాక్
సంగారెడ్డి జిల్లా/అందోల్ కాంసెన్సీ/నమస్తే ఇందూర్. నాగరాజు రిపోర్టర్ జనవరి 6
గాలిపటం ఎగరేస్తుండగా ఆరేళ్ల బాలుడు కరెంట్ షాక్కు గురైన ఘటన సంగారెగడ్డి (D) ఆందోల్(M) డాకూర్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక డబుల్ బెడ్ రూమ్ వద్ద బాలుడు పతంగి ఎగురవేస్తుండగా సమీపంలోని హైటెన్షన్ వైరుకు దారం చుట్టుకుంది. దీంతో గట్టిగా లాగడంతో కరెంట్ షాక్కు గురయ్యాడు. బాలుడిని సంగారెడ్డిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మెరుగైన వైద్యం కోసం HYDలోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.





