ఘనంగా ముందస్తు స్వామి వివేకానంద జయంతి వేడుకలు
జహీరాబాద్/జనవరి 10(నమస్తే ఇందూర్ అనిల్ కుమార్ ఇంచార్జి)
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ జహీరాబాద్ శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకొని స్థానిక స్రవంతి జూనియర్ కళాశాలలో సెమినార్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ జిల్లా సహకార్యవాహ శ్రీనివాస్ మాట్లాడుతూ స్వామి వివేకానంద జనవరి 12,1863 వ సంవత్సరంలో జన్మించాడు. అతి చిన్న వయసులోనే ఆధ్యాత్మికతకు అలవాటు పడి శ్రీ రామకృష్ణ పరమహంస దగ్గర శిష్యులుగా చేరి సన్యాసం పుచ్చుకొని భారతదేశం యొక్క సంస్కృతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పడం అదేవిధంగా చికాగోలో జరిగిన అంతర్జాతీయ సమావేశాలలో భారతదేశం యొక్క గ్రంథం భగవద్గీతను అత్యంత అడుగు బాగానపెట్టి అవమానించడం జరిగింది కానీ ఆ యొక్క సమావేశంలో వివేకనందుడు మాట్లాడినటువంటి ఒక మాటలకు ఆకర్షితులైనటువంటి ప్రజల యొక్క ఆకాంక్షను మేలుకొలుపుతూ ఉపన్యాసించడం కారణంగా ప్రపంచ దేశాలు ఈరోజు భారతీయ సంస్కృతిని కొనియాడుతున్నాయి అదే విధంగా మన యొక్క సంస్కృతిని అలవర్చుకుంటున్నారు కావున దేశంలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు వివేకానందుని యొక్క జీవిత చరిత్ర తెలుసుకొని అతని యొక్క అడుగుజాడల్లో నడిచి దేశం కోసం సమాజం కోసం పాటుపడాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దినేష్, నగర కార్యదర్శి సాయి,రాజు,మహేష్, కళాశాల ప్రిన్సిపల్ కృష్ణమాచారి, విద్యార్థులు పాల్గొన్నారు.

