శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా మహా శివరాత్రి వేడుకలు
▪️దర్శించుకున్న బీసీ వెల్పర్ ఆఫీసర్ కేశురాం దంపతులు
ఝరాసంగం ప్రతినిధి నమస్తే ఇందూర్ ఫిబ్రవరి 16
ఝరాసంగం మండల కేంద్రం లో శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా సాగాయి. ఈ సందర్భంగా బీసీ వెల్పర్ ఆఫీసర్ కేశురాం దంపతులు ఆ పరమేశ్వరునికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ
నిబద్దతకు, అచంచల విశ్వాసానికి, త్యాగానికి ప్రతీకగా ఉపవాస ధీక్షలతో, జాగారాలతో శివరాత్రి పండుగను హిందువులు జరుపుకుంటారని, సృష్టి లయకారునిగా శివున్ని భక్తి ప్రపత్తులతో కొలుచుకుంటారని తెలంగాణ ప్రజలకు, ప్రజలకు ఆ మహాశివుడు ఆయురారోగ్యాలను, సుఖ సంతోషాలను ప్రసాదించాలని ఆ పరమేశ్వరుడిని వేడుకున్నానన్నారు.

