చౌటకూరు మండల్ సరపల్లి వద్ద పోలీస్ వాహనాన్ని డి కొట్టిన లారీ
జోగిపేట ఎస్ ఐ పాండుగౌడ్ కు స్వల్ప గాయాలు 
సంగారెడ్డి వెల్నెస్ హాస్పిటల్ లో చికిత్స
సంగారెడ్డి జిల్లా /నమస్తే ఇందూర్ /ఫిబ్రవరి 16/అందోల్ నియోజకవర్గం ప్రతినిధి నాగరాజు
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం లో వింత చోటు చేసుకుంది. హైవేపై ఆగి ఉన్న పోలీస్ వాహనాన్ని వెనుక నుంచి ఢీ కొట్టిన డీసీఎం సంగారెడ్డి జిల్లా సరాపల్లి గ్రామ శివారులో నాందేడ్ హైవే ఎన్హెచ్ 161 జాతీయ రహదారి అర్ధరాత్రి చోటుచేసుకుంది. జోగిపేట పోలీస్ స్టేషన్ కు చెందిన వాహనం ధ్వంసం కాగా జోగిపేట ఎస్సై పాండు, డ్రైవర్ సల్మాన్ కు స్వల్ప గాయాలు అయ్యాయి. విధి నిర్వహణ భాగంగా జాతీయ రహదారిపై పెట్రోల్ నిర్వహిస్తుండగా క్రమంలో ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు జోగిపేట నుండి సంగారెడ్డి వైపు వెళ్తున్న ఎస్సై పాండు నాందేడ్ అకోలా జాతీయ రహదారి ఉండగా గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు వెళుతుండగా వారిని ప్రశ్నించడానికి పోలీస్ వాహనాన్ని ఆపడానికి చూసారు అనుకోకుండా వెనుక నుంచి వచ్చిన డీసీఎం పోలీస్ వాహనాన్ని డీ కొట్టింది దాంతో పోలీస్ వాహనం నుజ్జు నుజ్జు అయింది . ఈ ప్రమాదంలో ఎస్ఐ పాండు కు స్వల్ప గాయాలు కావడంతో ఆయనకు సంగారెడ్డి వెల్నెస్ హాస్పిటల్ కు చికిత్స నిమిత్తం తరలించారు . ప్రమాదానికి కారణమైన వాహనం ను పోలీసులు గుర్తించేందుకు పనిలో నిర్మగ్నమయ్యారు.

