మెదక్ జిల్లా కలెక్టర్‌కు ఆరు నెలల జైలు శిక్ష
ఉమ్మడి మెదక్ జిల్లా/నమస్తే ఇందూర్/ఫిబ్రవరి 18. కే యాదయ్య చీఫ్ బ్యూరో. మెదక్ జిల్లా కలెక్టర్
కోర్టు ధిక్కరణకు పాల్పడిన మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్‌కు హైకోర్టు 6 నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. చేగుంట మండలం బోనాల్లోని భూ వివాదంపై ఇరుపక్షాలకు నోటీసులిచ్చి పరిష్కరించాలన్న కోర్ట్ ఆదేశాలను కలెక్టర్ అమలు చేయలేదు. తగిన ఆధారాలు లేకుండా దరఖాస్తును తిరస్కరించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జస్టిస్ కె. లక్ష్మణ్, ఆయన ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని తీర్పు వెలువరించారు.

