ప్రెస్ అకాడమిక్ చైర్మన్గా నియమితులు అయినందుకు జర్నలిస్టుల సంబరాలు
ఉమ్మడి పుల్కల్ మండలం/నమస్తే ఇందూరు/ఫిబ్రవరి 26. కే యాదయ్య చీఫ్ బ్యూరో
జర్నలిస్టు రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న జాతీయ నాయకుడు కే శ్రీనివాస్ రెడ్డి ను రెండోసారి
రాష్ట్ర ప్రభుత్వం ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డిని రెండోసారిగా ప్రభుత్వం నియమించినందుకు ఆందోల్ నియోజకవర్గం కేంద్రం మైన జోగిపేటలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం(టీయూడబ్ల్యూజే ఐజేయు) ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని జర్నలిస్టులు అందరూ గురువారం సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు టపాకాయలు భారీ ఎత్తున కాలుస్తూ స్వీట్లు పంపిణీ చేస్తూతమసంబరాలుజరుపుకున్నారు .జర్నలిస్టుల హక్కుల సాధన కోసం నిరంతరం శ్రమిస్తున్న శ్రామికుడు అక్షరము అనే ఆయుధాన్ని చేబుని నవ సమాజ నిర్మాణం కోసం పయనిస్తున్న బాటసారి అటు పత్రిక రంగంలో ఇటు జర్నలిస్టు నాయకుడిగా సమర్థవంతంగా పాత్ర పోషిస్తూ ఎవరికి అన్యాయం జరగకుండా జోడు పాత్రలకు న్యాయం చేస్తూ ముందుకు సాగుతున్నారని కొని యాడారు. రాష్ట్ర మీడియా రంగ అభివృద్ధికి కృషి చేస్తున్న తెలంగాణ రాష్ట్రప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం మరో రెండేళ్ల పాటు పదవి కాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల జర్నలిస్టు సోదరులు సంబరాలు జరుపుకున్నారు. ఇప్పటికే తన పదవి కాలంలో మీడియా రంగానికి సంబంధించి పలు శిక్షణ కార్యక్రమాలు వర్క్ షాపులు సదస్సులు నిర్వహించడంలో శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్ర పోషించారన్నారు .గ్రామీణ జర్నలిస్టుల నైపుణ్యాభివృద్ధి డిజిటల్ మీడియా అవగాహన కార్యక్రమాలు మీడియా నైతిక విలువల పరిరక్షణ వంటి అంశాలలో అకాడమీ చురుకుగా వ్యవహరించిందన్నారు. పదవీకాలం పొడిగింపుతో మీడియా రంగంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు మరింత హూతం లభించిందని భావిస్తున్నాం ,రాష్ట్రంలో మీడియా ప్రమాణాలను మెరుగుపరచడం యువ జర్నలిస్టులకు అవకాశాలు కల్పించడం వంటి లక్ష్యాల సాధనకు ఈ నిర్ణయం తోడ్పడఉందన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులతో శ్రీనివాస్ రెడ్డి మరో రెండేళ్లు పదవి కాలం పొడిగించినందుకు అందోల్ నియోజకవర్గం ప్రెస్ క్లబ్ పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి,రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కి అందోల్
జర్నలిస్టు పక్షానప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఆందోల్ నియోజకవర్గం ప్రెస్ క్లబ్ అధ్యక్షులుకనకంటిభూమయ్య ,రాష్ట్ర సోషల్ మీడియా ప్రచార కమిటీ సభ్యులు మునిపల్లి యాదగిరి జిల్లా కార్యదర్శి ఆనంద్ వర్ధన్ ఐజేయుమాజీ సభ్యులు వెంకట్ రెడ్డి, అందోల్ నియోజకవర్గం లోని ఆయా మండలాలజర్నలిస్టులు,
రాజేందర్, ఆర్ఏ సత్యం,అశోక్, సుమన్, ధనంజయ్ , జైపాల్
రాజు, ఉమ్మడి పుల్కల్ ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు హజ్మత్ , కృష్ణ ,శేఖర్, హర్షద్ ,శంకర్, రాజ్ కుమార్,పల్లె గడ్డ రాజు శ్రీశైలం, దాసు, కుమార్, తదితరులు పాల్గొన్నారు.

