అనారోగ్యంతో బాధపడుతున్న మహేశ్వరి కుటుంబానికి ఎమ్మెల్యే ఎల్ఓసీ ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం…
నమస్తే ఇందూర్.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఆగష్టు 14
దుమ్ముగూడెం మండలం, బైరాగులపాడు గ్రామానికి చెందిన తుర్రం మహేశ్వరి గారు అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్య ఖర్చుల కోసం భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారి ఎల్ఓసీ ద్వారా మంజూరైన రూ.5,00,000/- (ఐదు లక్షల రూపాయలు) ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా సంబంధిత కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది.
ప్రజల కష్టాల్లో అండగా నిలుస్తూ, అత్యవసర వైద్య సహాయం అందిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రత్నం రమాకాంత్, భీమవరపు వెంకటరెడ్డి, చింతాడి రామకృష్ణ, గుండెపల్లి హనుమంతురావు, కంప్యూటర్ ఆపరేటర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.
*“ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలవడమే ప్రజాసేవకు అసలైన అర్థం.”*


