–వచ్చే ఎన్నికల్లో నేను ఓడిపోతా..
మా ప్రభుత్వం దిగిపోతుంది..
(నమస్తే ఇందూర్) హైదరాబాద్ డెస్క్
ఆగస్టు 22:
చెన్నూరు పాలిటెక్నిక్ విద్యార్థులతో జరిగిన సమావేశంలో మంత్రి వివేక్ వెంకటస్వామి చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. “వచ్చే ఎన్నికల్లో నేను ఓడిపోతా.. మా ప్రభుత్వం దిగిపోతుంది.. అందుకే నేను మీకు గ్యారెంటీ ఇవ్వలేను” అంటూ మంత్రి వ్యాఖ్యానించినట్లు సమాచారం. విద్యార్థులు తమ సమస్యలు, విద్య, ఉద్యోగ అవకాశాలు, భవిష్యత్ అవసరాలపై మంత్రిని కలిసి ప్రభుత్వం నుంచి హామీ ఇవ్వాలని కోరిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తరఫున స్పష్టమైన హామీ ఇవ్వాలని విద్యార్థులు కోరగా మంత్రి ఈ విధంగా స్పందించినట్లు సమాచారం. మంత్రి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు ఈ వ్యాఖ్యలపై తమదైన రీతిలో స్పందిస్తున్నారు. మరోవైపు నెటిజన్లు సైతం మంత్రి వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ భవిష్యత్‌పై మంత్రి స్వయంగా చేసినట్లు ప్రచారం జరుగుతున్న ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. అయితే మంత్రి వ్యాఖ్యల పూర్తి సందర్భం, ఆయన ఉద్దేశం ఏమిటన్నది స్పష్టత రావాల్సి ఉంది.


